Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలీవుడ్ నటుడికి గ్యాంగ్ స్టర్ బెదరింపులు!

  • ఫోన్ చేసి బెదిరిస్తున్న గ్యాంగ్ స్టర్ మున్నా పూజారి
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన నటుడు ఆదిత్య పంచోలీ
  • రూ. 25 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ 
బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలీకి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఫోన్ చేస్తున్న ఆగంతకులు ఆదిత్య పర్సనల్ సమాచారాన్ని చెబుతున్నారు. తామడిగిన డబ్బు ఇవ్వకుంటే ఏదైనా చేయగలమని బెదిరిస్తున్నారు. ఈ విషయమై ఆదిత్య పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

అక్టోబర్ 18 నుంచి మున్నా పూజారి అనే వ్యక్తి తనను బెదిరిస్తూ మెసేజ్ లు పెడుతున్నాడని ఆదిత్య ఆరోపించాడు. డబ్బు ట్రాన్స్ ఫర్ చేసేందుకు ఓ బ్యాంకు ఖాతా నెంబరును కూడా ఇచ్చాడని పోలీసులకు చెప్పాడు. ఆ ఖాతా సంఖ్య ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
aditya pancholi
gangster
extortion

More Telugu News